తెలంగాణ
Mahesh Kumar Goud: కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి బయటపడింది

Mahesh Kumar Goud: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో తేటతెల్లమైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.మైనార్టీలతో కూడిన బీసీ రిజర్వేషన్లు ఒప్పుకోబోమని బీజేపీ పెద్దలు చెప్పడం ఎక్కడిపాట అక్కడే పాడినట్లుగా ఉందని కమలదళంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు.
బీజేపీ పాలిత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్ల సంగతి ఏంటని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కవితకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలివిడత జనహిత యాత్ర విజయవంతం అయిందని మహేష్ అన్నారు.



