తెలంగాణ
Mahesh Kumar Goud: 2023లో తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ వచ్చింది

Mahesh Kumar Goud: గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు, వీహెచ్, అంజన్ కుమార్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. 2023లో తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో కుల గణన సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఖర్గే, రాహుల్ ఆశయాలకు అనుగుణంగా రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నామని మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోందన్నారు.