తెలంగాణ
Mahesh Kumar Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది

Mahesh Kumar Goud: పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి అప్పులపాలు చేశారని తేల్చిందన్నారు. తనకి ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు.
రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు. ఇది సామాన్య విషయమా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కార్ రేస్‌లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లు కక్కక తప్పదు అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.