తెలంగాణ
బీసీ రిజర్వేషన్ బిల్లుపై మోదీని ఒప్పించే దమ్ముందా.. బండి సంజయ్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు తెస్తామని.. ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టించే దమ్ముందా? అని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో జరిగిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీని ఒప్పించే దమ్ముందా అంటూ బండికి సవాల్ విసిరారు. దేశవ్యాప్త కులగణనకు మోదీని అడిగే సత్తా ఉందా అన్న మహేష్ కుమార్ గౌడ్ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా భవిష్యత్తు బీసీలదే అన్నారు. బీజేపీ బీఆర్ఎస్‌లు బీసీ నేతను సీఎంని చేయగలవా? అంటూ ప్రశ్నించారు. అయితే బీసీ నేతను సీఎం చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు.