Athadu : అతడు రీరిలీజ్ కి సర్వం సిద్ధం.. సీక్వెల్ పై నిర్మాత క్లారిటీ.. ?

Athadu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక మంచి వార్త. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గిఫ్ట్‌లా, అభిమానులకు పండుగలా ‘అతడు’ సినిమా మళ్లీ థియేటర్లకు రాబోతోంది. 2005లో విడుదలై భారీ విజయం సాధించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఇప్పుడు 8కే క్వాలిటీతో తిరిగి విడుదల చేయనున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఇష్టమైన చిత్రంగా నిలిచింది. మణిశర్మ సంగీతం, బ్రహ్మానందం కామెడీ, ట్రెండ్ సెట్టింగ్ కథనశైలి, ఇవన్నీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ చిత్రాన్ని జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు. గత కొంతకాలంగా అభిమానులు ఈ సినిమాను మళ్లీ తెరపై చూడాలని కోరుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో, ఇక ఆలస్యం చేయకూడదని భావించి రీ రిలీజ్ నిర్ణయం తీసుకున్నారు.
మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకుని ఈ రీ రిలీజ్‌ను సెలబ్రేషన్లలా మార్చేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35, దేవి వంటి పెద్ద థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. నైజాంలో ఆసియన్ సునీల్ భారీగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా మంచి స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ రీజియన్ వారీగా పోటీ పడుతూ హక్కులు కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్‌కి 3 కోట్లకుపైగా ధర పలికిందట. ఒక్కటే కాదు, ‘అతడు 2’ అంటే సీక్వెల్పై కూడా చర్చలు జరుగుతున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా ఈ ఆలోచనపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. సినీ ప్రియులు, మహేష్ ఫ్యాన్స్‌కి ఈ రీ రిలీజ్ నిజంగా ఒక విశేషం. 8కే పిక్చర్, థియేటర్లలో పండగ వాతావరణం, మళ్లీ తెరపై ‘అతడు’ను చూడటానికి రెడీ అవ్వండి.



