Mahesh Babu: మహేష్ బాబుకి షాక్.. నోటీసులు జారీ

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు రియల్ ఎస్టేట్ కేసులో చిక్కుల్లో పడ్డారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఇరుక్కున్నారు. సాయి సూర్య డెవలపర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయనపై రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాలాపూర్‌లో లేని ప్లాట్ల కోసం కొనుగోలుదారులు రూ.34.8 లక్షలు చెల్లించి మోసపోయారని ఫిర్యాదు.
మహేష్ ఫోటోలతో ప్రచారం చేయడంతో నమ్మకం కలిగి డబ్బు ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. కమిషన్ ముందు హాజరుకావాలని మహేష్‌తో పాటు సంస్థ యజమాని కంచర్ల సతీష్‌కు నోటీసులు అందాయి. గతంలో ఈడీ కూడా మనీలాండరింగ్ కేసులో మహేష్‌ను ప్రశ్నించింది. ఈ వివాదంపై ఆయన ఇంతవరకు స్పందన ఇవ్వలేదు. ఈ కేసు ఆయన ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.