సినిమా
మహావతార్ పరశురామ నుంచి భారీ అప్డేట్!

Mahavatar Parashurama: మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బ్లాక్‌బస్టర్ తర్వాత, ఇప్పుడు మహావతార్ పరశురామ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్తో అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు.
మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం ఇండియన్ సినిమాలో సంచలన విజయం సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పుడు అదే యూనివర్స్ నుంచి మహావతార్ పరశురామ చిత్రం రాబోతోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవనున్నట్లు సమాచారం. ఈ పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో అశ్విన్ కుమార్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని అంచనా. అభిమానులు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



