ఆగని మహావతార్ నరసింహ గర్జన!

Mahavatar Narsimha: మహావతార్ నరసింహ చిత్రం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ యానిమేటెడ్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, టికెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జూలై 25, 2025న విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం భారతీయ యానిమేషన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా అసాధారణ వసూళ్లతో 200 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. విష్ణు పురాణంలోని ప్రహ్లాదుడి కథను ఆధారంగా తీసుకుని, అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, సామ్ సిఎస్ సంగీతంతో ఈ చిత్రం రూపొందింది.
ఉత్తర భారతంలోనూ ఈ చిత్రం భారీ ఆదరణ పొందుతోంది. మూడో వారాంతంలోనూ థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. బుక్ మై షోలో లక్షల్లో టికెట్లు విక్రయమవుతున్నాయి. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది.



