పాకిస్తాన్ కరాచీలో మహావతార్ నరిసింహా సినిమా ప్రదర్శన

Pakistan: పక్కన ఉన్నవాడు ఎప్పుడూ స్పేహితుడు కాడు.. ఛాన్స్ దొరికితే వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉంటారు. అలాంటిదే మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా. ఇండియా పక్కనే ఉంటూ ఎప్పుడూ ఛాన్స్ దొరుకుంతా ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురుచూస్తుంది. గిల్లీ, గిచ్చి మరీ పంచాయితీ పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు అక్కడ హిందూవులే షరీఫ్ సర్కార్‌కు చుక్కలు చూపిస్తున్నారు.
వాళ్ల దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది సారుగారికి. దీంతో ఏం చేయాలో అర్థం కాకా ఆ దేవుడినే తలుచుకునే పరిస్థితికి వచ్చారు. భక్తి, పురాణం, ఆధ్యాత్మికత, భావోద్వేగం, విజువల్ గ్రాండియర్ అన్నింటి కలబోతగా తెరకెక్కిన సినిమాతో వణికిపోతున్నారు అక్కడి అధికారులు. ఇంతకీ అది ఏ సినిమా..? ఎక్కడ ప్రదర్శించారు..?
పాకిస్తాన్ మన దాయాది దేశం అనేకన్నా మన శత్రుదేశం అంటే కరెక్ట్‌గా సరిపోతుందోమో. అలా ప్రవర్తిస్తూ ఉంటుంది పాక్. ఎప్పుడూ భారత్‌పై దాడి చేద్దామా అని గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటుంది. పాకిస్తాన్‌లోని ఇప్పటికీ హిందూవులపై అణచివేతలు, దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా పాక్‌లో హిందూ మత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా సింధ్ ప్రావిన్స్‌లో, ముఖ్యంగా ఉమర్‌కోట్, కరాచీ వంటి ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి.
హింగ్లాజ్ మాతా ఆలయం వార్షిక యాత్ర, శ్రీరామ్ దేవ్ పీర్ ఆలయంలో జరిగే మేళా వంటివి పాకిస్తాన్‌లో అతిపెద్ద హిందూ తీర్థయాత్రలు. అలాగే కరాచీలో ఉన్న చారిత్రక స్వామి నారాయణ దేవాలయం అతి పురాతనమైనది. హిందువులు మొహర్రం వంటి పండుగలలో కూడా పాలుపంచుకుంటారు. ఇది స్థానిక సూఫీ సంస్కృతిలో మత సామరస్యానికి నిదర్శనం.
తాజాగా పాకిస్తాన్‌కి దిమ్మ తిరిగి బొమ్మ కినిపించే సీన్ చూపించారు అక్కడి హిందువులు. ఇండియాపై ఎప్పుడూ అక్కసు ప్రదర్శించే షరీఫ్ సర్కార్ హాయాంలో అక్కడే మహావతార్ నరసింహ సినిమాను ప్రదర్శించారు. ఆస్కార్ బరిలో ఉన్న యానిమేషన్ చిత్రం ఇది. కరాచీలోని చారిత్రక స్వామి శ్రీ నారాయణ స్వామి దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా వందల సంఖ్యలో పాకిస్తానీహిందువులు తరలివచ్చారు. వారంతా సినిమాను వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
పాకిస్తాన్‌లో హిందూ సంస్కృతికి, భక్తికి ఇది నిదర్శనంగా నిలువగా దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది. ఈ వీడియోలు చూసిన పాకిస్తాన్ అధికారులు, పౌరులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అది సినిమా ప్రభావమో లేక హిందూవుల ఐక్యతో కానీ భారత్‌పై దాడి చేయడానికి ప్లాన్ చేసిన వారందరీకి మాత్రం ఇదోక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వితే ఇక పాకిస్తాన్ లో మ్యాప్ లో ఉండదు అది కూడా హిందూ దేశంగా మారిపోతుంది అనడానికి ఇదో ఊదాహరణ.
ఇకపోతే పాకిస్తాన్‌లోని కారాచీలో ది ఫేమస్ టెంపుల్ శ్రీ స్వామినారాయణ మందిరం. ఇది పాకిస్తాన్ మొత్తంలో ఉన్న ఏకైక నరసింహా స్వామి ఆలయం. ఇది 200 ఏళ్లకు పైబడిన పురాతన ఆలయం. ప్రాథమికంగా లక్ష్మీ దేవతకు అంకితం చేయబడింది. కరాచీలో మిగిలి ఉన్న కొన్ని క్రియాశీల హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయం MA జిన్నా రోడ్‌లో ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇది హిందువులతో పాటు ఇస్లాం మతాన్ని అనుసరించే వారిని కూడా ఆకర్షిస్తుంది.
ముస్లింలు కూడా పూజలు చేసుకోవడానికి అక్కడి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అదే అలాయంలో ఓ ఇండియన్ సినిమాను ప్రదర్శించారు. అది కూడా లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన యానిమేటేడ్ సినిమా. ఈ యానిమేటెడ్ చిత్రం హిందూ ఇతిహాసాలపై ఆధారపడడంతో వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చి సినిమాని వీక్షించారు. కాగా.. 1947లో బ్రిటిష్ ఇండియా విభజనకు ముందు ప్రస్తుత పాకిస్థాన్ ప్రాంతంలో హిందువులు 15 నుంచి 16 శాతం ఉండేవారు. కానీ విభజన తర్వాత లక్షలాది మంది హిందువులు భారత్‌కు వలస వెళ్లిపోయారు.
దీని కారణంగా హిందూ జనాభా చాలా తగ్గిపోయింది. పాకిస్థాన్‌లో హిందువులు ఎక్కువగా సింధ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ముఖ్యంగా థార్‌పార్కర్, మీర్‌పుర్‌ఖాస్, ఉమర్‌కోట్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. థార్‌పార్కర్‌లో హిందువులు 50 శాతం మించి ఉన్నారు. ఇది పాకిస్థాన్‌లో హిందువులు మెజారిటీగా ఉన్న ఏకైక జిల్లా.
ఇక.. ఈ సినిమా విషయానికి వస్తే సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ సుమారు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి.
ఆ ఎలివేషన్ సీన్స్.. అందుకు తగ్గట్టుగా వచ్చే మ్యూజిక్ రోమాలునిక్కబొడుచుకునేలా చేశాయి. ఈ సినిమా ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది. కేవలం మౌత్ టాక్ ద్వారానే దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, నరసింహ స్వామి కథను ఎంతో శక్తివంతంగా, భావోద్వేగంగా చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా ఈ యానిమేషన్ చిత్రం కేవలం చిన్నపిల్లల కోసమే కాదు, పెద్దలు కూడా చూడవచ్చని నిరూపించింది.
కాగా లేటెస్ట్ గా ఈ మూవీ మరో ఘనత సాధించింది. 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ సాధించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. 2026లో జరగబోయే అస్కార్ అవార్డుల రేసులో మహా అవతార్ నరసింహ పేరు ఉన్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఆస్కార్ అవార్డ్ కోసం యానిమేషన్ కేటగిరిలో మొత్తం 35 సినిమాలు పోటీ పడుతుండగా ఈ లిస్టులో మహావతార నరసింహా కూడా ఉన్నట్టే మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రం అద్భుతంగా చేసేది ఏమిటంటే విశ్వం యొక్క కాలాతీత చరిత్ర నుండి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కొత్త తరానికి వారు కనెక్ట్ చేయగల ఫార్మాట్‌లో తిరిగి పరిచయం చేయడం. చాలా వివరణాత్మక 3D యానిమేషన్‌లో, ఇది హిరణ్యకశిపు పాలన యొక్క చీకటిని, చిన్న ప్రహ్లాదుడి ధైర్యాన్ని, భగవంతుడు నరసింహుడి ఉరుములాంటి రూపాన్ని పునఃసృష్టిస్తుంది. మహావతార్ నరసింహ యొక్క యానిమేషన్ నాణ్యత , అతిశయోక్తి లేకుండా, భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చూడని అత్యుత్తమమైనది. ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమాకి పాకిస్థాన్ దేశంలో నీరాజనాలు పలకడం హాట్ టాపిక్ గా మారింది.



