News

Maha Shivaratri 2025: తెలుగురాష్ట్రాల్లో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

Maha Shivaratri 2025: శివతత్వం వేదాలకు చిక్కదు ఉపనిషత్తలకు దొరకదు. నమక చమకాలకు లొంగదు.. మహర్షులకు అంతుపట్టదు. శివానుభవం లభించాలంటే శివ భక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నిరాకారం నుండి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని భక్తుల నమ్మకం.

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు హరుడుని కొలిచేందుకు పొటేత్తుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button