అత్యాచారం కేసులో 'మోనాలిసా' డైరెక్టర్ అరెస్ట్

సోషల్ మీడియా స్టార్ మోనాలిసా గురించి అందరికీ సుపరిచితం. మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి ఒక్కసారిగా ప్రసిద్ధి పొందింది. సామాన్య జీవితం నుంచి ఒక్క ఉదుటున ఫేమస్ అయిన మోనాలిసాకు డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ సినిమా అవకాశం కల్పించారు. కానీ, ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది.
సనోజ్ మిశ్రాపై ఓ యువతి రేప్ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం, సనోజ్ తనను లైంగికంగా వేధించి, వీడియోలు రికార్డ్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.ఇదిలా ఉండగా, సనోజ్ మిశ్రా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ అనే సినిమాతో మోనాలిసాను హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. కానీ, మోనాలిసా ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటూ మీడియా దృష్టిలో నిలుస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా తనకు ఆదర్శమని, వారి స్థాయిని చేరుకోవాలని కలలు కంటున్నట్లు తెలిపింది. అంతేకాక, సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకున్నారని, ఆయన వల్ల తనకు చాలా ఉపయోగం కలిగిందని ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు సనోజ్ అరెస్ట్‌తో ఈ సినిమా ప్రాజెక్ట్ భవిష్యత్తు సందిగ్ధంగా మారింది.