తెలంగాణ

Maganti Sunitha: జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోంది

Maganti Sunitha: జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతుందని, ఓటర్లను భయపెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని సునీత విమర్శించారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. పలు చోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని ప్రశ్నించారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. బోరబండలో ఓ రౌడీ షీటర్ ప్రజలను బెదిరిస్తున్నా పోలీసులు అతనికి సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమకు ఓటు వేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామని ఆశా వర్కర్లను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్‌లో పోలీసుల వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు దౌర్జన్యం చేస్తున్నా, బూత్‌లలో యధేచ్చగా తిరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని, ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button