తెలంగాణ
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇంచార్జ్‌లను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.



