RTC బస్సు నడిపిన పిచ్చోడు.. 60 కిలోమీటర్లు డ్రైవింగ్

నెల్లూరు ఆర్టీసీ బస్టాండులో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ చేసింది. ఉదయాన్నే బస్సును డిపో నుంచి తీసేందుకు డ్రైవర్ కండక్టర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు. కంగారుపడ్డ బస్సు డ్రైవర్ కండక్టర్లు. అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులను అలర్ట్ చేశారు. అని ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దాటినట్లుగా గుర్తించిన పోలీసులు.
బస్సును ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్దకు చేరుకోగానే పోలీసులు, స్థానికుల సహాయంతో బస్సును నిలిపివేశారు. ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు తీరా బస్సు నడిపిన వ్యక్తిని విచారిస్తే గుండె గుభేల్ మనే విషయం తెల్సింది. అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా తెల్సి ఒక్కసారిగా పోలీసులు నివ్వేరపోయారు. అతని పేరు బిట్రగుంట కృష్ణ విడవలూరు మండలం కంచర్లపాలెం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.