తెలంగాణ
Madhavaram Krishna Rao: కాంగ్రెస్‌కి ఒక న్యాయం? BRSకి మరో న్యాయమా?

Madhavaram Krishna Rao: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫ్లెక్సీ వార్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా సీన్ మారింది. మాజీ సీఎం కేసీఆర్, MLA మాధవరం కృష్ణారావు.. ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కి ఒక న్యాయం? BRSకి మరో న్యాయమా? అంటూ అధికారులను నిలదీశారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక తమవి తొలగించినట్లే.. కాంగ్రెస్ బ్యానర్లు కూడా రోడ్లపై తీయకపోతే.. అధికారులకు బుద్దిచెప్తామంటున్నారు మాధవరం కృష్ణారావు.