సినిమా

Madharasi: శివ కార్తికేయన్ మదరాసి రిలీజ్ డేట్ వచ్చేసింది

Madharasi: శివ కార్తికేయన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం “మదరాసి”. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ సృష్టించిన ఈ సినిమా, శివ కార్తికేయన్ కెరీర్‌లో అమరన్ తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శివ కార్తికేయన్ డ్యాషింగ్ లుక్‌తో కూడిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.

ఏ ఆర్ మురుగదాస్ మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు శివ కార్తికేయన్ వైవిధ్యమైన నటనతో ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, “మదరాసి” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button