తెలంగాణ
చెన్నూరు లో పిచ్చి కుక్కల స్వైర విహారం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన వీధులు, బ్యాంకులు, ఆసుపత్రులు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చికెన్ సెంటర్ల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడేయడంతో రోడ్లపై పిచ్చికుక్కల సంచారం పెరిగిందని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల క్రితం చెన్నూర్ పట్టణంలోని రౌండ్ హనుమాన్ టెంపుల్ సమీపంలో చిన్నారి వైష్ణవిపై పిచ్చికుక్కలు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



