ఆంధ్ర ప్రదేశ్
అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి వేడుకలు

అల్లూరి జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆయా గ్రామాల పొలిమేర సమీపాల్లో ఉన్న పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పాలు, గుడ్లు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. కార్తీక మాసంలో వచ్చే మొదటి చవితిన నాగదేవతలకు పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది.



