ఆంధ్ర ప్రదేశ్

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడుతోంది. వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశముంది. ఎల్లుండికి తుఫాన్‌గా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది.

తుపాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశముందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబరు 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button