ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్‌తో లోకేష్ భేటీ

Nara Lokesh: పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్–గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు మంత్రి నారా లోకేష్. గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో సమావేశమైన మంత్రి నారా లోకేష్ పలు అంశాలపై చర్చించారు.
పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా హబ్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.



