సినిమా

పిచ్చెక్కిస్తున్న లోకేష్-అజిత్ కాంబో?

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్ట్ అజిత్‌తో చేయనున్నట్లు టాక్. ఖైదీ 2 తరువాత ఈ కొత్త కాంబినేషన్ ఖరారు అనే వార్త వినిపిస్తుంది.దీంతో కోలీవుడ్‌లో భారీ హైప్ మొదలైంది. బ్లాక్‌బస్టర్ ఖాయమని అంచనాలు ఏర్పడ్డాయి.

హైప్ క్రియేట్ చేసే దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ముందు వరుసలో ఉన్నారు. ‘కూలీ’ అంచనాలు అందుకోకపోయినా మంచి వసూళ్లు సాధించింది. ఇక తన తదుపరి ప్రాజెక్ట్‌పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. తన DC సినిమా పూర్తయిన తరువాత ముందుగా ‘ఖైదీ 2’ ఇమీడియట్‌గా ఉంటుందని తెలిసింది. కానీ లేటెస్ట్‌గా థల అజిత్ కుమార్‌తో సినిమా చేయనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అజిత్-లోకేష్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ నిజమైతే కోలీవుడ్‌లో మరో భారీ గ్రాసర్ పడనుంది. లోకేష్ దర్శకత్వంలో అజిత్ నటిస్తే బ్లాక్‌బస్టర్ ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ రూమర్స్ బాగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కాంబో అభిమానులను పండగ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button