తెలంగాణ
Malla Reddy: బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప .. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదు

Malla Reddy: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. చలో వరంగల్ వాల్ పోస్టర్‌ను మల్లారెడ్డి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని పార్టీ శ్రేణులకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఆవిర్భవించి 25ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16 నెలల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదన్నారు