లైఫ్ స్టైల్

Lips Care: పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి..

Lips Care: చలికాలం వచ్చిదంటే చాలు. చర్మ సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా పెదాలు కూడా పగులుతుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఇంటి వద్దనే ఈజీ చిట్కాలతో పెదాలను ఎర్రగా, అందంగా మార్చుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

నిమ్మరసం: నిమ్మరసాన్ని పెదాలపై రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే పొడిబారడం తగ్గుతుంది. దీని వల్ల పెదాలపై చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. పెదాలు పగలవు.

కలబంద: కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. దీనిని పెదాలపై అప్లై చేస్తే పొడి పెదాలు, ఇతర సమస్యలు దూరవుతాయి. అందుకే రెగ్యులర్‌గా ఈ టిప్ ఫాలో అయితే పెదాలు పగలడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు.

తేనె: తేనె కూడా నేచురల్ మాయిశ్చరైజర్. దీన్ని పెదాలపై అప్లై చేస్తే పెదాలు హైడ్రేట్ అవుతాయి. దీంతో పొడిబారడం సమస్య తగ్గి పెదాలు పగిలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.

కొబ్బరి నూనె: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసి పడుకోండి. కొబ్బరి నూనెలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి పెదాలను మృదువుగా, కోమలంగా మార్చుతాయి.

చక్కెర: చక్కెర గింజల్లో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి పెదాలను స్క్రబ్ చేయండి. ఇలా ఒకటి నుంచి 2 నిమిషాల పాటు చేస్తూ 5 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారం రోజుల పాటు ప్రతిరోజూ చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా మరియు మెరుస్తూ ఉంటాయి.

(గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button