తెలంగాణ
పిడుగు పడి రెండు ముక్కలైన వేప చెట్టు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చెరువు ముందు తండాలో పిడుగు పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక రైతు బోడ నవీన్ నాయక్ కౌలు చేసిన బావి వద్ద ఉన్న వేప చెట్టుపై పిడుగు పడి రెండు ముక్కలైంది.
పిడుగు పడిన సమయంలో అక్కడే పనిచేస్తున్న కూలీ సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులు మెరుపులు, ఉరుములతో కూడిని వర్షాలు ఉంటాయని.. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.



