ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: విశాఖ వెలంపేటలో ఒరిగిన బిల్డింగ్

Visakhapatnam: విశాఖపట్నం జిల్లా వన్‌టౌన్ పరిధిలోని వెలంపేటలో ప్రాంతంలో ఓ భవనం ఒకవైపునకు ఒరిగింది. ఐదంతస్తుల భవనం మరో ఇంటి మీదకి వంగడంతో అది ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన భవనం వద్దకు చేరుకొని నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. బిల్డింగ్ ప్రక్కకు ఒరిగిపోవడంతో ప్లాట్ కోనుగోలు చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూ ప్రొఫెసర్లు వచ్చి పరిశీలించిన తర్వాత భవనంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.



