తెలంగాణ
Jurala Project: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. 12 గేట్లు ఎత్తివేత

Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతామైన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలకు కారణంగా జూరాల ప్రాజెక్ట్‌కు వరద పొటెత్తుంది. జూరాల ప్రాజెక్ట్‌కు 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 97 వేలు కాగా, ఔట్‌ఫ్లో 88 వేల క్యూసెక్కుల నీటి అధికారులు విడుదల చేశారు.
పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లకు కాగా ప్రస్తుతం నీటిమట్టం 317మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 7.740 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కృష్ణ నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.