తెలంగాణ
గౌతమ్ మోడల్ స్కూల్ లో లిఫ్ట్ ప్రమాదం… ఏడుగురికి గాయాలు

నిజాంపేట్ గౌతమ్ మోడల్ స్కూల్ లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టీచర్లు గాయాలయ్యాయి. ఘటన పాఠశాల వదిలే సమాయంలో అయ్యింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం ప్రగతి నగర్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు.
మొదటి అంతస్తు నుండి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పై పడడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా జరిగింది. అలాగే టీచర్ల స్థానంలో విద్యార్థులు ఉండి ఉంటే ఘోరం జరిగేదని స్థానికులు తెలిపారు.వివిధ స్కూల్ యాజమాన్యం సైతం లిఫ్టులు ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.



