సినిమా
Dharmendra Death: దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra Death: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పేరుగడించిన ధర్మేంద్ర ఈ లోకం విడిచివెళ్లడంతో బాలీవుడ్ దుఃఖసాగరంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన్ను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.



