Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య

Lavanya: గండిపేట మండలం కోకాపేటలోని సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా.
నగరంలోని మూసాపేట ప్రాంతం నుండి రాజ్ తరుణ్ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు.
కొంతమంది కేర్ టేకర్స్ కలిసి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.
అప్పటికే ఆ ఇంటిలో నివాసం ఉంటున్న లావణ్య.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేట్ కు రావడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇప్పటివరకు కిరాయి ఇంటిలో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతోటే వచ్చామని చెబుతున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.
అప్పటికే ఆ ఇంటిలో లావణ్య ఉంటుందని తెలుసని అయినా ఇల్లు విశాలంగా ఉన్నందున తాము అదే ఇంటిలో వేరొక గదిలో ఉండాలని వచ్చినట్లు పేర్కొంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.
కాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనను ఈ ఇంటి నుండి గెంటివేయడానికి వచ్చారని ఆరోపిస్తున్న లావణ్య.
తమకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని అయినా తనపై దౌర్జన్యం చేయటానికి ఇక్కడికి వచ్చారని చెబుతున్న లావణ్య.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో కలిసి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న లావణ్య
ఇంటిలోనికి వస్తూనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని తెలిపిన లావణ్య.
గతంలో తానే రాజ్ తరుణ్ తో కలిసి ఉందామని చెప్పానని కలిసి ఉండడానికి వచ్చినట్లయితే తానెందుకు అడ్డుకుంటానని ప్రశ్నిస్తున్న లావణ్య.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి బసవరాజులు ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న లావణ్య.
పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన తర్వాతనే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లోపలికి రావాలని స్పష్టం చేస్తున్న లావణ్య.