సినిమా

హరిహర వీరమల్లు రిలీజ్ పై తాజా అప్డేట్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాబోతోంది.

పవన్ కళ్యాణ్ తొలి పాన్-ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసింది. 17వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఏ.ఎం. రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలయ్యే అవకాశముందని టాక్. నిధి అగర్వాల్, బాబీ దేఓల్, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీ-రికార్డింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button