సినిమా

‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్‌పై సరికొత్త అప్‌డేట్?

Thug Life: కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ గురించి కీలక సమాచారం తెలిసింది. సినిమా బాక్సాఫీస్ వైఫల్యం నేపథ్యంలో ఓటీటీ రిలీజ్‌పై సంచలన డెసిషన్ తీసుకుంది మూవీ టీం.

కమల్ హాసన్, మణిరత్నం లాంటి దిగ్గజాల కలయికలో వచ్చిన ‘థగ్ లైఫ్’ సినిమా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. 1987లో ‘నాయకన్’తో అభిమానులను ఆకట్టుకున్న ఈ జోడీ, ఈసారి మాత్రం నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచే కలెక్షన్లు భారీగా తగ్గాయి.

దీంతో, ఓటీటీ రిలీజ్‌పై చర్చలు ఊపందుకున్నాయి. మొదట 8 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని చిత్ర బృందం చెప్పినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం దక్షిణాది భాషల్లో జూన్ 27 లేదా జూలై 4 నాటికి స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. హిందీ వెర్షన్ జూలై 31 నాటికి వస్తుందని టాక్. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button