జై హనుమాన్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్!

Jai Hanuman: జై హనుమాన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అంచనాలను మరింత పెంచింది.
హనుమాన్ సినిమా విజయం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, తేజ సజ్జా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేయనున్నారు.
ఈ వీడియో గ్లింప్స్ లేదా టీజర్‌గా ఉండొచ్చని అంటున్నారు. టీ-సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. హనుమాన్ సినిమా కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో భారీ వసూళ్లు సాధించగా, జై హనుమాన్ కూడా అదే స్థాయిలో అంచనాలను రేకెత్తిస్తోంది. రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 పనుల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. 2025లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం 2026కి వాయిదా పడే అవకాశం ఉంది.