సినిమా
హరిహర వీరమల్లు: క్లైమాక్స్ కి అరుపులే.. ఎందుకంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్షన్ కొరియోగ్రఫీ ప్రతిభను చాటారు. హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదల కానుంది. అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీలోనూ తన సత్తా చాటుతున్నారు. హరిహర వీరమల్లు చిత్రంలో క్లైమాక్స్‌లో 18 నిమిషాల ఉత్కంఠభరిత యాక్షన్ ఎపిసోడ్‌ను స్వయంగా డిజైన్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ తిరిగి కొరియోగ్రాఫర్‌గా మెరిశారు.
ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో రూపొందుతూ, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తెరకెక్కింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటన, ఏ.ఎం. రత్నం భారీ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలను మించనుంది. జూలై 24న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది.