L2 Empuraan OTT Release: ఎల్2 ఎంపురాన్ ఓటీటీకి రెడీ

L2 Empuraan OTT Release: మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. మోహన్‌లాల్ యాక్షన్, పృథ్వీరాజ్ డైరెక్షన్ కలగలిసిన ఈ చిత్రం ఏప్రిల్ 24 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
‘ఎల్2 ఎంపురాన్’ రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో భారీ వసూళ్లు రాబట్టి థియేటర్లలో సంచలన విజయం సాధించింది. మోహన్‌లాల్ నటన, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.
బాక్సాఫీస్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ, ఓటీటీలోనూ అదే హవాను చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్, డ్రామా, విజువల్స్‌తో సౌత్ సినిమా ప్రియులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. మరి, ఓటీటీలో ‘ఎల్2 ఎంపురాన్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.