ఆంధ్ర ప్రదేశ్
ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది

Kundu River: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరంలో భారీ వర్షానికి కుందూనది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇంజెడు సమీపంలో కుందూ వాగు వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. గ్రామ వీధులన్నీ నదిని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యల కోసం గ్రామ ప్రజలు నంద్యాల జిల్లా ఎంపీ శబరితో వీడియో కాల్ చేశారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంటనే స్పందించి నేను వస్తున్నాను అంటూ హరివరం గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు.



