తెలంగాణ
Kumaraswamy: బోనాలు చారిత్రక పండగల వైభవానికి ప్రతి రూపం

Kumaraswamy: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బీసీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనాలు చారిత్రక పండగల వైభవానికి ప్రతి రూపమని బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు బోనాలు నిలువెత్తు ప్రతి రూపమని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ కృష్ణమోహన్ అన్నారు.