కుబేర: ఓటీటీకి రెడీ!

Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మేకర్స్ తాజా అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల మాస్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం కుబేర థియేటర్లలో ఘన విజయం సాధించింది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో హైలైట్. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేని వారు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
అభిమానులకు శుభవార్తగా, కుబేర జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సినిమా కథ, నటన, సంగీతం కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని సమీక్షలు చెబుతున్నాయి. ఈ సినిమా ఓటీటీలో కూడా అదే హవాను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఓటిటిలో కుబేరని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు.