సినిమా

కుబేర: టికెట్ బుకింగ్స్‌లో అద్భుత రికార్డు!

Kubera: ధనుష్, నాగార్జున నటించిన శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. సూపర్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం అనూహ్య వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. టికెట్ బుకింగ్స్‌లోనూ సంచలనం నమోదైంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ‘కుబేర’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైనప్పటి నుంచి అద్భుతమైన టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 1 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం.

ఇప్పటికీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రేక్షకుల ఉత్సాహం, కుబేర క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. చిత్ర బృందం ఈ సందర్భంగా స్పందిస్తూ, ‘కుబేర’ థియేటర్లను ఉర్రూతలూగిస్తూ, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోందని, ఇది నిజమైన బ్లాక్‌బస్టర్ అని పేర్కొంది. ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button