News
KTR: నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించేనున్న కేటీఆర్

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానిస్తారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎం బీసీ మైదానంలో బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.



