తెలంగాణ
KTR: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటీఆర్ ట్వీట్

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్‌కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.