తెలంగాణ

KTR: ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాన్ని తాము పెద్దగా పట్టించుకోబోమని చెప్పారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నో సర్వేలు తమ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ చివరి మూడు రోజుల్లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్‌కు కొత్త బలం ఇచ్చిందని, రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం తమ పార్టీనే అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, మాగంటి సునీత చివరి వరకు పోరాడారని చెప్పారు. ఉపఎన్నికలో తాము కులం–మతం రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజమని, ఈ ఫలితంపై తమకు నిరాశ లేదని, ప్రతిపక్షంగా తమ పనిని కొనసాగిస్తామని చెప్పారు. చివరగా, మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button