తెలంగాణ
KTR: కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుంది

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు చేయలేనిది కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచే శారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు.. కేసీఆర్ విజయాల్లో పదో వంతు సాధించలేరంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
60 ఏళ్లలో జరగని పనులను కేసీఆర్ విజయవంతంగా పూర్తిచేశారన్నారు. కాళేశ్వరం ద్వారా కరువు, దాహానికి పరిష్కారం చూపించారన్నారు కేటీఆర్. ఇక కేసీఆర్ ను అర్ధం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదన్నారు కేటీఆర్.