తెలంగాణ
KTR: రాహుల్ కంగ్రాట్స్.. బీజేపీని గెలిపించారు

KTR: ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు. బీజేపీని మరోసారి గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కేటీఆర్ జతచేశారు. దేశంలో మోదీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.