తెలంగాణ

కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ

KTR: నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు.

విద్యార్థుల సమస్యలను విన్న కేటీఆర్, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రత్యేక కార్యాచరణకు బీఆర్ఎస్‌తో పాటు విద్యార్థులు కలిసి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button