తెలంగాణ
KTR: ధరల పెంపు వల్ల దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం

KTR: కేంద్రమంత్రి హార్దీప్‌సింగ్ పూరికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పెంచిన పెట్రో, గ్యాస్ ధరలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరల పెంపు వల్ల దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతుందన్నారు. భూటాన్, పాకిస్థాన్, శ్రీలంకలో కంటే ఇండియాలోనే పెట్రో రేట్లు ఎక్కువ అన్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన దేశంలో పెట్రో ధరలను కేంద్రం పెంచుతుందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం చెప్పిన అచ్చే దిన్ ఇదేనా అని కేటీఆర్ విమర్శించారు. పెట్రో సెస్ వల్ల రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక అన్యాయం జరుగుతుందన్నారు.