తెలంగాణ
KTR: ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం

KTR: రైతు రాజ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తకర ట్వీట్ చేశారు. రైతే రాజు రాజకీయ నినాదంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వ విధానంగా నిలిచింది. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో.. ఆత్మవిశ్వాసం కోల్పోయి… కాడిని వదిలి.. వలసబాట పట్టిన రైతన్న… తిరిగి భూమిని నమ్ముకుని బువ్వను అందించేందుకు… తన పాలనతో గుండె ధైర్యం నింపారు కేసీఆర్ అన్నారు. రైతన్నకు పెట్టుబడి కోసం రైతుబంధు అందించి. రైతన్న ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా అందించారన్నారు.



