తెలంగాణ
KTR: మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా?

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్వలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట – పర్యావరణ పరిరక్షణ పేరుతో మీరు చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేసారన్నారు. తరువాత, మీరు అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారు. బంజరు భూముల్లో బల్లులు కూడా గుడ్లు పెట్టవు అని అన్నారు.
ఇప్పుడు మీరు జంతువుల ఇళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ పేర్కొన్నారు. మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా? అంటూ ధ్వజమెత్తారు. మీరు ఎన్నికైన ప్రతినిధినా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా? అని ప్రశ్నించారు. విధ్వంసం మీ ఏకైక నినాదమని కేటీఆర్ ట్వీట్ చేశారు.