తెలంగాణ
KTR : స్వాతంత్య్ర దినోత్సవం.. జాతీయ జెండాను ఎగరవేసిన కేటీఆర్

KTR : తెలంగాణ భవన్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం కేసీఆర్పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజా యోధుడు పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేశారు. తెలంగాణ అస్థిత్వం కోసం కేసీఆర్ పాటుపడ్డారని ఆయన కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. పరిపాలన నడపడం చేతకాక కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు.



