మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు భేటీ

KCR: లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో హరీష్‌రావు, కేటీఆర్ కీలక భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్‌ను సిద్దం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. కేటీఆర్ నిన్నటి నుంచి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు.
కేసీఆర్‌తో సమావేశం అనంతరం కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే కేటీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ కేడర్‌తో కేటీఆర్ సమావేశం అవుతున్నారు. గులాభీ కార్యకర్తలను లోకల్ బాడీ ఎన్నిలకు కేటీఆర్ సిద్ధం చేస్తున్నారు. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది.