తెలంగాణ
KTR: రెండు దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టారు

KTR: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 300 కోట్లు పెట్టినా ఒక్క పని ముందుకు కదల్లేదన్నారు. వరంగల్‌లో దండుపాళ్యం బ్యాచ్ ఉంది. దండుపాళ్యం బ్యాచ్ నిధులను దండుకుపోతుందన్నారు.
20 నెలల్లో ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడపోయాయని నిలదీయాలన్నారు. తులం బంగారం ఎక్కడపోయిందని నిలదీశారు. రెండు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టారన్నారు. కేసీఆర్ టైమ్‌లో నాట్లప్పుడు రైతు బంధు పడితే రేవంత్ హయాంలో ఓట్లప్పుడు రైతు బంధు పడుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.